25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనే తెలంగాణ తెచ్చుకున్నాం

Must read

📰 Generate e-Paper Clip

  • గ్రూప్ -1 లో అక్రమాలు జరిగాయని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు
  • ఎగ్జామ్ ను రద్దు చేసి మళ్లీ రీ ఎగ్జామ్ పెట్టండి
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్,  బతుకమ్మ : విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనే తెలంగాణ తెచ్చుకున్నాం.. గ్రూప్ -1 లో అక్రమాలు జరిగాయని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.. ఎగ్జామ్ ను రద్దు చేసి మళ్లీ రీ ఎగ్జామ్ పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో గల సెంట్రల్ లైబ్రరీ వద్ద గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై విద్యార్థులతో చర్చించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం వెళ్లారు. సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లకుండా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. సెంట్రల్ లైబ్రరీ ప్రధాన ద్వారం లోపలికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడకుండా పోలీసులు అడ్డగించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా జాగృతి నాయకుల నినాదాలు చేశారు. సెంట్రల్ లైబ్రరీ గేటు వద్దనే బైఠాయించి కల్వకుంట్ల కవిత, జాగృతి నాయకులు ఆందోళనకు దిగారు. గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో ముచ్చటించారు. అనంతరం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. ‘‘గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై విద్యార్థులతో మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాను.. లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ పరిపాలనలో కూడా అవకతవకలు జరిగాయని విద్యార్థులు చెప్పారు. ఆనాడైనా, ఈనాడైనా విద్యార్థులకు న్యాయం జరగాలనే నేను కోరుతున్నా. ప్రభుత్వం పారదర్శకంగా రిక్రూట్ మెంట్లు చేసి ఉంటే రాత్రికి రాత్రే అపాయింట్ మెంట్లు ఇవ్వాల్సిన అవసరమేముంది? మా పేపర్లను ఇస్తామంటూ ప్రతి విద్యార్థి ఛాలెంజ్ చేస్తున్నాడు.. ఉద్యోగాలు వచ్చిన వారి పేపర్లు బయట పెట్టడానికి ప్రభుత్వానికి భయం ఎందుకు? ర్యాంకర్ల పేపర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనక్కి పోతుంది.  ప్రతిభ, ధైర్యం ఉన్న విద్యార్థులు ఛాలెంజ్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదు. అర్హత లేని వారికి ఉద్యోగాలు రావద్దనే మేము కోరుతున్నాం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను తుంగలో తొక్కి నాన్ లోకల్స్ 8 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో తిరుగుతూ తెలంగాణలో  విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవటం లేదు.  రాహుల్ గాంధీ ఇక్కడకు రావాలి. లేదంటే మేము బీహార్ కు వస్తాం. ఈ విధంగా విద్యార్థులకు అన్యాయం చేయవద్దని కోరుతున్నా. రేపు కోర్టులో ఈ అంశంపై విచారణ ఉంది. న్యాయమూర్తులు కూడా ఆలోచన చేయాలని కోరుతున్నా.  తెలుగులో పరీక్షలు రాసిన విద్యార్థులకు అన్యాయం చేశారు.  గ్రూప్ -1 రాసిన వాళ్లలో పోలీసోళ్ల పిల్లలు కూడా ఉన్నారు. మీ పిల్లలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతున్నారని పోలీసులను అడుగుతున్నా.  తెలుగు, ఉర్ధూ మీడియం లో రాసిన అభ్యర్థులకు అన్యాయం చేశారు.  ఇది వరకు ఉన్న ప్రభుత్వం అన్యాయం చేసినందుకే ఆ ప్రభుత్వాన్ని ఓడించారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ పాత 50 వేల ఉద్యోగాలే ఇచ్చారు తప్ప ఒక్క కొత్త నోటిఫికేషన్ వేయలేదు. తెలంగాణలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం పై పార్లమెంట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు? గ్రూప్-1 విషయంలో డివిజన్ బెంచ్ లో అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ప్రభుత్వం బేషజాలకు పోకుండా గ్రూప్ -1 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా.

We brought Telangana to provide jobs to students.

  • విద్యార్థులతో కలిసి చాయ్ తాగిన కవిత..

చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద విద్యార్థులతో కలిసి కల్వకుంట్ల కవిత చాయ్ తాగారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని, గ్రూప్ – 1లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.

We brought Telangana to provide jobs to students.

  • పోలీసుల అదుపులో తెలంగాణ జాగృతి నాయకులు..

చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద పోలీసులు పలువురు జాగృతి నాయకులను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సెంట్రల్ లైబ్రరీ వద్ద ఆందోళన చేస్తున్న పలువురు జాగృతి నాయకులపై పోలీసులు దాడి చేశారు.

We brought Telangana to provide jobs to students.

More articles

Latest article