29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మాదిగలు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు

Must read

📰 Generate e-Paper Clip

  • టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాదిగలు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా ఉంటారని టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ అన్నారు. మాదిగ సామాజిక వర్గనికి మరో మంత్రి పదవి అడ్లూరి లక్ష్మణ్ కి కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సోమవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 30సంవత్సరాల వర్గీకరణ పోరాటానికి మొదటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలు జరిపిన ప్రతి మీటింగ్ లో పాల్గొని అండగా నిలబడ్డారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీ సాక్షిగా దేశంలో వర్గీకరణ చేసేది మొదట తెలంగాణ రాష్ట్రమే అని ముఖ్యమంత్రి చెప్పడం చెప్పిన విధంగానే వెంటనే మంత్రివర్గ కమిటీ , షమీం అత్తర్ కమిషన్ ఏర్పాటు చేయడం జస్టిస్ షెమింగ్ అత్తర్  కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో చట్టం చేయడం మాదిగల ఆకాంక్షల నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు టి.రాజ్ గగన్, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి దుర్గయ్య, దారి హరీష్, మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article