సిలిండర్ లో నీళ్లు

0 9,121

నిజామాబాద్, బతుకమ్మ  :  ఇందల్వాయి గ్రామానికి చెందిన తుమ్మల పార్వతి అనే మహిళ తన సిలిండర్ అయిపోవడంతో బుక్ చేసుకుంది. డెలివరీ బాయ్ ఇంటికి వచ్చి రూ. 980  తీసుకొని సిలిండర్ ఇచ్చి వె ళ్లాడు. తీరా సిలిండర్ బిగించి పోయ్యి వెలిగిస్తే వెలగలేదు. దీంతో ఆమె సిలిండర్ను పరిశీలించగా అందులో పూర్తిగా నీటితో నిండి ఉందని తెలిపారు. డిచ్ పల్లి శివమ్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు సిలిండర్ డెలివరీ చేస్తూ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించింది. అధిక డబ్బులు వసూలు చేయడమే కాకుండా సిలిండర్లో నీళ్లు నింపడం యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.