- హిందువులను వంచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ
- నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీజేపీ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ అని హిందువులను వంచించే పార్టీ కాంగ్రెస్ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. సామాన్య ముస్లిం ల కోసమే వక్ఫ్ చట్టం, ఇది ఓవైసీ కోసం కాదని అన్నారు. మహమ్మద్ ఘోరీ సమయంలోనే ఈ ప్రక్రియ మొదలయ్యిందని తెలిపారు. వక్ఫ్ ఆస్తులు పేదలకు విద్యా వైద్యం కోసం వెచ్చించాలని చట్టం చెబుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో వక్ఫ్ బోర్డుకు ఓట్ల కోసం న్యాయపరమైన హక్కులు ఇచ్చారు అని ఆరోపించారు. దీంతో అనేక అక్రమాలు జరిగాయనీ వక్ఫ్ చట్టం ఏ రకంగా అన్యాయమో ముస్లిం లీడర్లు చెప్పాలి అని ఎంపీ కోరారు. వక్ఫ్ చట్టాన్ని 1995 లో పివి నర్సింహ రావు, సోనియా గాంధీ లు భయంకరంగా మార్చారు అన్నారు. రైతులు సాగు భూములను వక్ఫ్ కిందకు మార్చారు దానివలన రైతుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముస్లింలలోని అన్ని వర్గాల ప్రయోజనాల కోసమే చట్ట సవరణ జరిగిందని దానిని ముస్లింలు కూడా హర్షిస్తున్నారన్నారు. వక్ఫ్ వ్యతిరేక ర్యాలీ లకు అనుమతులు ఎలా ఇస్తారు అని జిల్లా అధికార యంత్రం గాని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, మహిళా మోర్చా నాయకురాలు స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

