. .. . . రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
నిజామాబాద్ క్రైం , బతుకమ్మ :
ఆర్మూర్ డివిజన్ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరింగ్ విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ ఏడు వేల లంచం తీసుకుంటుండగా సోమవారం సాయంత్రం పట్టుకుని అరెస్టు చేశారు. ఈఈ సంతకం చేయించేందుకు గాను రూ.7500 లంచం డిమాండ్ చేయగా చివరకు బాధితుడితో బేరం కుదుర్చుకుని రూ.7000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసి హైదరాబాద్ లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చి విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
