నిజామాబాద్, బతుకమ్మ : పుణ్య క్షేత్రాలను ఆర్టీసీ సౌజన్యంతో దర్శించుకోవచ్చని నిజామాబాద్ ఆర్టీసీ డిపో -1 డీఎం ఆనంద్ తెలిపారు. ఈఅవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 27న (శుక్రవారం ఉదయం) 05.00 గంటలకు డీలక్స్ బస్సు నిజామాబాద్ నుంచి యాత్రికులతో బయలుదేరుతుంది. ధర్పల్లిలోని ప్రయాణికులతో కామారెడ్డి, సిద్దిపేట మీదుగా ఉదయం 09.00 గంటలకు యాదగిరి గుట్టకు చేరుకుంటుంది. యాదాద్రి సందర్శన తర్వాత అక్కడి నుంచి 12 గం.లకు బయలుదేరి, స్వర్ణగిరిని సందర్శించి, వీలైతే సువర్ణపురిని కూడా సందర్శించి అటునుంచి ముచింతల్ రావటం జరుగుతుంది. రామానుజుల వారి స్టాచ్యూ ఆఫ్ ఈక్విలాటీ విగ్రహాన్ని సాయంత్రం సందర్శించి అటునుంచి బయలుదేరుతుంది. అర్ధరాత్రి వరకు నిజామాబాద్ కు చేరుకుంటుంది.
నిబంధనలు
▶ స్పెషల్ బస్ కావున ఇందులో మహాలక్ష్మి స్కీమ్ వర్తించదు.
▶ ఒక్కరికి ఛార్జీ: రూ.1400/-
▶ ఓపీఆర్ఎస్ సర్వీస్ నంబర్: 96660
▶ అడ్వాన్స్ రిజర్వేషన్ కోరుకునే వారు నిజామాబాద్ బస్ స్టేషన్ లోని రిజర్వేషన్ కౌంటర్ ను కానీ, నిజామాబాద్ బస్ స్టేషన్ మేనేజర్ గారిని కానీ లేదా tgsrtcbus.in నీ కానీ సంప్రదించవచ్చు.
