ఆర్టీసీ సౌజన్యంతో పుణ్య క్షేత్రాల సందర్శన

నిజామాబాద్, బతుకమ్మ : పుణ్య క్షేత్రాలను ఆర్టీసీ సౌజన్యంతో దర్శించుకోవచ్చని నిజామాబాద్ ఆర్టీసీ డిపో -1 డీఎం ఆనంద్ తెలిపారు.  ఈఅవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 27న (శుక్రవారం ఉదయం) 05.00 గంటలకు డీలక్స్ బస్సు  నిజామాబాద్ నుంచి యాత్రికులతో బయలుదేరుతుంది. ధర్పల్లిలోని ప్రయాణికులతో కామారెడ్డి, సిద్దిపేట మీదుగా ఉదయం 09.00 గంటలకు యాదగిరి గుట్టకు చేరుకుంటుంది. యాదాద్రి సందర్శన తర్వాత  అక్కడి నుంచి 12 గం.లకు బయలుదేరి, స్వర్ణగిరిని సందర్శించి, వీలైతే సువర్ణపురిని కూడా సందర్శించి అటునుంచి ముచింతల్...