– ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కు వినతి
బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు కేంద్రంలో కోతుల బెడద నుండి గ్రామస్తులకు రక్షణ కల్పించాలని బిఆర్ఎస్ యువ నాయకులు, సమాచారం హక్కు చట్టం ప్రతినిధి గంగుల రవీందర్ కోరారు.ఈ సందర్బంగా కామారెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వడ్ల రమేష్ కు గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలకేంద్రంలో ఇప్పటివరకు చాలా మందిని కోతులు గాయపరిచాయని తెలిపారు. కోతులు వన్యప్రాణులే కాబట్టి నియంత్రణ చర్యలో భాగంగా కోతులను అటవీ ప్రాంతంలోకి తరలించే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
