నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ నగరానికి చెందిన జిలకర్ విజయానంద్ కు గోవా లో రియో రిసార్ట్ లో నిర్వహించిన జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా అలుమ్ని క్లబ్ నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో ప్రతిష్ఠాత్మక అవుట్‌స్టాండింగ్ జోన్ వైస్ చైర్మెన్ అవార్డు ఆఫ్ ఇండియా దక్కింది. గత ఏడాది పొడవునా వివిధ ప్రాజెక్టులు, వివిధ శిక్షణ కార్యక్రమాలు చేసిన సేవకు గానూ గుర్తింపుగా నేషనల్ చైర్మన్ అంజలి గుప్తా ఈ అవార్డు అందచేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన నేషనల్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా ఉందని, అవార్డ్ కు తన పేరును ప్రతిపాదించిన జోన్ చైర్మన్ డి.వి.ఎస్. గుప్తా, జోన్ 12 అధికారులకు విజయానంద్ ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీఐ నేషనల్ ఆఫీసర్లు సునీల్ కుమార్, వినయ్ మెహతా, జై కుమార్, మనోజ్ టక్కర్, జీవీఎన్ రాజు, భగవాన్ వైయస్, గంప నాగేశ్వర్ రావు, జోన్ 12 చైర్మన్ 2025 డి వి ఎస్ గుప్తా, 2026 చైర్మన్ నవీన్ చవల్లా, జోన్ బోర్డు సభ్యులు శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, శ్యాంసుందర్, రీజియన్ చైర్మన్ లావణ్య, అపర్ణ, నిధి టక్కర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
