బతుకమ్మ,ముప్కాల్: గురుకుల విద్యా సంస్థలలో నిర్వహించిన ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రెంజర్ల గ్రామంలో గల విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. పాఠశాల నుంచి మొత్తం 44 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ సోహెల్ తెలిపారు. ప్రతి ఒక్కరి కృషి వల్ల ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ నిలపడంతో ఈ విజయం సాధించామని ఆయన పేర్కొన్నారు.
