రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా సీతా దయాకర్‌రెడ్డి నియామకం

0 11,562

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా సీతా దయాకర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మధుర నగర్ లోని కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఛైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌ రెడ్డితో పాటు ఆరుగురు సభ్యులను నియమించారు. సభ్యులుగా కంచర్ల వందనగౌడ్‌, బి.అపర్ణ, మరిపల్లి చందన, గోగుల సరిత, ప్రేమలతా అగర్వాల్‌, బి.వచన్‌కుమార్‌ ని నియమించారు. ఛైర్‌పర్సన్‌, ఆరుగురు సభ్యులు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Seetha Dayakar Reddy appointed as Chairperson of State Commission for Protection of Child Rights

 

Leave A Reply

Your email address will not be published.