27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఇంటర్మీడియట్ ఫలితాలలో “వెక్టార్ ” విద్యార్థుల హవా

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి విజయఢంకా మోగించారు. . ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మధు సూధన్ జోషి  డైరెక్టర్ సంఘం సంతోష్, గజానన్, కార్తీక్ విచ్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా మధు సూధన్ జోషీ మాట్లాడుతూ…ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో వెక్టార్ కళాశాలకు చెందిన  మొదటి సంవత్సరం ఎంపీసీ ఫలితాల్లో జొర్రీగల సాత్విక్ 468/470 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాంధించగా, బుట్టు హేమశ్రీ 467/470 మార్కులు,జి.వీణ, సూర్యవంశి 466/470 మార్కులు , భానుశ్రీ, మణిరాజ్, రక్షిత, శర్వాణి ఈ నలుగురు 465/470 మార్కులు సాధించారు. కళాశాలకు చెందిన 43 మంది విద్యార్థులు 460 కి పైగా మార్కులు సాధించారు .బైపిసి మొదటి సంవత్సరంలో బండి శరత్ చంద్రిక 437/440 మార్కులలతో రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించారు . సీనియర్ ఇంటర్  ఎంపిసీలో ఎస్. మనస్విని 991/1000 మార్కులతో రాష్ట్ర స్థాయి-ర్యాంకు సాధించగా  989/1000 మార్కులతో జి. శ్రీనిధి 988/1000 మార్కులను వంశి, యశ్వంత్,సుమిత్ కుమార్, మోర శ్రీవాస్తవ ప్రతిభ కనబరి చారని కళాశాల చైర్మన్ మధుసూదన్ జోషి తెలిపారు

More articles

Latest article