27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

 ఏ.ఐ.యు.కే.ఎస్. రాష్ట్ర అధ్యక్షులు గా వి. ప్రభాకర్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ , బతుకమ్మ  :

అఖిలభారత ఐక్య రైతు సంఘం ( *ఏ.ఐ.యు.కే.ఎస్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా వి. ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆగస్టు 25,26 తేదీల్లో మహాబూబ్ నగర్  జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర ప్రథమ   మహాసభల్లో కామ్రేడ్.వి. ప్రభాకర్ ను  ప్రతినిధులు ఎన్నుకున్నారు. కామ్రేడ్.వి. ప్రభాకర్ విప్లవోద్యమంలో కీలకమైన నేతగా నిలిచారు. తన ఉద్యమ ప్రస్థానాన్ని  సిరికొండ మండలం గడ్కోల్ గ్రామం నుండి  ప్రారంభించారు. ఈ ప్రాంతం లో పెత్తందారులు, దోపిడీ దారులు ప్రజా కంటకులుగా మారి  పీడిస్తున్న సమయంలో  ఆనాటి సిపిఐ ఎంఎల్  రైతు కూలి సంఘం గా గడ్కోల్ కేంద్రంగా తన విప్లవ జీవితాన్ని ప్రారంభించారు. అమరుడు కామ్రేడ్ డివి. కృష్ణ స్ఫూర్తితో కామ్రేడ్. ప్రభాకర్ విప్లవ రైతంగా పోరాటాల వైపు వచ్చి  పోరాట వారసత్వాన్ని అందిపుచ్చుకొని కొనసాగుతున్నాడు. జిల్లాలో ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్ లో పసుపు పంట, రైతుల సమస్యలపై, ఎర్రజొన్న రైతుల సమస్య లపై అనేక ఉద్యమాలు నిర్మించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్. కే. ఎం ) ఉద్యమంతో దేశవ్యాప్త ఉద్యమంతో రైతంగా ఉద్యమాల్లో అగ్రగామిగా నిలిచాడు.కామ్రేడ్. వి. ప్రభాకర్. తన ఉద్యమ  పోరాట తత్వాన్ని సంఘం గుర్తించి విప్లవ రైతుసంఘం అయిన ఏ.ఐ.యు.కే.ఎస్.  సర్వ సభ్యులు వి. ప్రభాకర్ ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా ఏకగ్రీవ ఎన్నికున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన బి. దేవారం ను రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, ఎస్. సురేష్ ను, బి. బాబన్న ను రాష్ట్ర కమిటీ సభ్యులు గా ఎన్నుకున్నారు.

More articles

Latest article