ఏ.ఐ.యు.కే.ఎస్. రాష్ట్ర అధ్యక్షులు గా వి. ప్రభాకర్
నిజామాబాద్ , బతుకమ్మ : అఖిలభారత ఐక్య రైతు సంఘం ( *ఏ.ఐ.యు.కే.ఎస్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా వి. ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆగస్టు 25,26 తేదీల్లో మహాబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర ప్రథమ మహాసభల్లో కామ్రేడ్.వి. ప్రభాకర్ ను ప్రతినిధులు ఎన్నుకున్నారు. కామ్రేడ్.వి. ప్రభాకర్ విప్లవోద్యమంలో కీలకమైన నేతగా నిలిచారు. తన ఉద్యమ ప్రస్థానాన్ని సిరికొండ మండలం గడ్కోల్ గ్రామం నుండి ప్రారంభించారు. ఈ ప్రాంతం లో పెత్తందారులు, దోపిడీ దారులు ప్రజా...