29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అపరిశుభ్రంగా పబ్లిక్ టాయిలెట్లు

Must read

📰 Generate e-Paper Clip

  • పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు

 

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని అంగడి బజార్లో పబ్లిక్ టాయిలెట్లు అపరిశుభ్రంగా మారాయి. మరుగుదొడ్లు గ్రామపంచాయతీ నిర్మించినప్పటికీ వాటి నిర్వహణ, శుభ్రత మాత్రం పట్టించుకోవడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేస్తే జరిమానాలు విధిస్తామని ప్రకటించే అధికారులు వీటి నిర్వహణ పట్టించుకోవాలని, అంగడి బజార్లోని టాయిలెట్ల నుండి భరించలేని దుర్వాసనతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు చొరవ తీసుకొని చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Unsanitary public toilets

More articles

Latest article