- కాంగ్రెస్ నాయకుల ప్రతి సవాల్
బతుకమ్మ,ఏర్గట్ల: మండం కేంద్రంలో ఆదివావరం బిఆర్ఎస్ పార్టీ ఇసుక అక్రమ రవాణా పైన చేసిన ఆరోపణలకు ఏర్గట్ల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసుక వివాదంపై సవాల్ విసిరారు. ఈ సందర్భంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమా దేవరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాప్రసాద్, మాట్లాడుతూ గతంలో మీ పాలనలో జరిగిన ఇసుక దందా వ్యాపారం పైన బహిరంగ చర్చకు సిద్దమే అన్నారు. గత పదేళ్లు బిఆర్ఎస్ నాయకులకు దోచుకొని దాచుకోవటం అలవాటు అయింది అని అన్నారు. మీ ప్రభుత్వంలో పది మంది చేతిలోనే ఇసుక వ్యాపారం నిర్వహించారని, ఈ విషయం మీ పార్టీ కార్యకర్తలను అడిగిన చెపుతారని తెలిపారు. ఎన్నోసార్లు అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ పత్రికలో వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో శివన్నోళ్ళ శివకుమార్, మండల పార్టీ అధ్యక్షుడు సోమ దేవారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగ ప్రసాద్,గడ్డం జీవన్ రెడ్డి, రేండ్ల రాజారెడ్డి, ముస్కు మోహన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి, బట్ట పూర్ బలే శ్రీనివాస్, లింగంపల్లి ప్రసాద్ గౌడ్, కూరాకుల బోర్రన్న,ఓర్సు రాములు, మేకల సాయన్న,ఏర్గట్ల మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
