. . . పేట్ బషీరాబాద్ పీఎస్ లో మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు
. . . భగిరథ్ పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
. . . తనను హనీ ట్రాప్ చేశారని కరీంనగర్ లో బండి భగిరథ్ ఫిర్యాదు
వెబ్ డెస్క్, బతుకమ్మ :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి సాయి భగిరథ్ ను వివాదం అలుముకుంది. బండి సాయి భగీరథ్ మీద పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం పోక్సో కేసు నమోదు అయింది. తమ 17 ఏళ్ల మైనర్ కుతూరుకు బండిసాయి భగిరథ్ మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుకు తాత్సరం చేయడంతో ప్రైవేట్ కేసు నమోదుకు తల్లిదండ్రులు ప్రయత్నించడంతో ఈ వ్యవహరం బహిర్గతమైంది. ఆరు గంటల తరువాత బండి భగిరథ్ పై పోక్సో కేసు నమోదు అయింది. మొయినాబాద్ ప్రాంతంలోని ఫార్మ్ హౌజ్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేయడంతో బీఎన్ఎస్ 74,75 సెక్షన్లతో పాటు, సెక్షన్ 11 ఆర్/డబ్ల్యూ 12 పోక్సో చట్టం కింద బండి సాయి భగీరధ్ మీద పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండి సంజయ్ కొడుకు కారణంగా రెండు సార్లు తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాలిక తల్లిదండ్రుల ఆరోపణ లు చేస్తున్నారు. కేసు నుండి తప్పించుకునేందుకు తమ కూతురిపైనే బండి సంజయ్ కొడుకు తప్పుడు కేసులు పెడుతున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను ఓ అమ్మాయి కుటుంబం హనీ ట్రాప్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బండి భగిరథ్ కరీంనగర్ పోలీస్ స్టేషన్ 1 లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కొంపల్లికి చెందిన ఓ ఫ్యామిలి తన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తుందని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కేసు విచారణలో ఉండగానే బండి సాయి భగిరథ్ పై పోక్సో కేసు నమోదు కావడం రాజకీయంగా సంచలనం రేపింది. ప్రధాని మోడీ మూడవసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారి హైదరాబాద్ లోని బహిరంగ సభకు వస్తున్న వేళ కేంద్రమంత్రి తనయుడిపై కేసు నమోదు కలకలం రేపుతుంది. ప్రతి పక్షాలు బండి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ఇది అంతా కుట్ర పూరితంగా జరిగిందని బండి అనుచరులు ఆరోపిస్తున్నారు.
