. . . ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి పొన్నం
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూరగాయల ఉమారాణి, డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్ లు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముఖ్యఅతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలు హాజరయ్యారు.ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల ఆలోచన మేరకు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో నేడు మున్సిపల్ ప్రజలు ఆశీర్వదించాల న్నారు. మేయర్ గా బీసీ బిడ్డకు బాధ్యతలు అప్పగించామన్నారు. 2014లో తెలంగాణ ప్రత్యేక బిల్లు పాస్ అయింది ఇదే రోజు అని మంత్రి పొన్నం గుర్తు చేశారు. ఇప్పటికే 12 ఏళ్ళు పూర్తయిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై వివక్ష చూపిస్తుందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులకు కచ్చితంగా న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 250 గజాల స్థలానికి సంబంధించి కమిటీ వేసామని అన్నారు. నగరంలో అన్ని డివిజన్లకు సమన్యాయం చేయాలని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మేయర్ కు సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలని తర్వాత అభివృద్ధి తమక్షమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, నూడా చైర్మన్ కేశ వేణు,మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత,కాంగ్రెస్ నాయకులు జావేద్ ఆక్రం, రత్నాకర్, నరేందర్ రెడ్డి తదితరులున్నారు.

