నిజామాబాద్, బతుకమ్మ : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 18 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. అనంతరం వీరిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ముందర హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఇద్దరికి వారం రోజలు జైలు శిక్ష, 16 మందికి రూ. 10,000 చొప్పున సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ జరిమానా విధించినట్లు తెలిపారు.