మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్,బతుకమ్మ
ప్రజాసేవ చేసేందుకు స్థానిక ఎన్నికల్లో మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నూతనంగా ఎన్నుకోబడిన, ఎన్నుకొనున్న సర్పంచ్ లకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని జానకం పేట గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొలిపాక సంతోష్ రెడ్డి, వార్డు మెంబర్లు సౌడ రాకేష్, ఎడ్ల ఓపెష్,తలారి గంగాధర్, వేణు లు ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారిని శాలువ, పూలమాలలతో సన్మానించిన ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు మనల్ని ఆధరించినందున గ్రామాభివృద్ధి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని హితవు పలికారు.ఈ అవకాశాన్ని నిజాయతీతో వినియోగించుకొని ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలని, ద్వారా రాజకీయంగా భవిష్యత్ లో ఉన్నత పదవులు అలంకరించాలని ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీయర్ ఎస్ నాయకులు నాగాధర్ రెడ్డి,సౌడ రమేష్, కొలిపాక శ్రీనివాస్, సత్యం, డైరెక్టర్ శేఖర్, శోభన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.