- 109 గ్రాముల గంజాయి,రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం
- సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: గంజాయి కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి వెల్లడించారు. ఈ సందర్భంగా సి.ఐ మొగిలి మాట్లాడుతూ ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సూర అజయ్,సుర ప్రదీప్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయికి అలవాటు పడిన వారికి ఎక్కువ ధరలకు అమ్ముతూ వాటితో జల్సాలు చేస్తుండేవారు.గూడెం గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు నిషేధిత గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ముస్తాబాద్ ఎస్.ఐ గణేష్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లగా అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద 109గ్రాముల గంజాయి ఉండగా అట్టి నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్ కు తరలించడం జరిగిందని సి.ఐ మొగిలి తెలిపారు.అక్రమంగా గంజాయి సేవించిన, క్రయవిక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవని ఈసందర్భంగా హెచ్చరించారు.యువత డ్రగ్స్ భారినపడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ లు , నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. జిల్లాలో గంజాయికి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ వారికి సమాచారం అందించి గంజాయి రహిత జిల్లాగా మర్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.
