గంజాయి కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్, రిమాండ్ కి తరలింపు
109 గ్రాముల గంజాయి,రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: గంజాయి కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి వెల్లడించారు. ఈ సందర్భంగా సి.ఐ మొగిలి మాట్లాడుతూ ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సూర అజయ్,సుర ప్రదీప్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయికి అలవాటు పడిన వారికి ఎక్కువ ధరలకు అమ్ముతూ వాటితో జల్సాలు చేస్తుండేవారు.గూడెం గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం దగ్గర ఒక ఇద్దరు...