టీఆర్ఎస్ పేరు కల్వకుంట్ల కవిత కు కేటాయింపు

0 13,795

 

. . . తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుకు ఈసీ ఆమోదం

 హైదరాబాద్, బతుకమ్మ:

టీఆర్ఎస్  పార్టీ పేరును కల్వకుంట్ల కవిత కు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సేనకు పేరుకు బదులుగా  తెలంగాణ రక్షణ సేన అన్న పేరును ఖరారు చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ నెల 25న కవిత తెలంగాణ రాష్ట్ర సేనను (టిఆర్ఎస్) ను స్థాపించిన విషయం తెలిసిందే.  కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి ని బిఆర్ఎస్ గా మార్చిన నేపథ్యంలో ఈసీ టీఆర్ఎస్ పేరును ఆమోదించడం పై సందేహాలు వ్యక్తం అయ్యాయి. టిఆర్ఎస్ పేరును ఇతరులకు కేటాయించవద్దు అని గులాబి పార్టీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు సమితి అధ్యక్షుడు సైతం కవిత స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సేన( టిఆర్ఎస్) అబ్రివేషన్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. గురువారం తెలంగాణ రాష్ట్ర సేన ( టీఆర్ఎస్ ) పార్టీ పేరుకు బదులుగా తెలంగాణ రక్షణ సేన అన్న పేరును ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు టిఆర్ఎస్  పార్టీ పేరిట పత్రాలు కు కవిత పార్టీ కార్యాలయంలో అందచేశారు.ఎన్నికల సంఘం ప్రకటన తో కవిత రాజకీయ పార్టీ ఐన తెలంగాణ రక్షణ సేన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. కవిత అభిమానులు, టిఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సేన రిజిస్ట్రేషన్ విషయంలో పేరు మార్పు అనివార్యమైంది. కొత్త గా తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పేరును మళ్లీ కవిత ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది.

TRS name assigned to Kalvakuntla Kavitha


			

Leave A Reply

Your email address will not be published.