29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

న్యాక్ సెంటర్ ను సందర్శించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

నిజామాబాద్‌ నగరంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ( న్యాక్ )ను టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించారు.  గురువారం న్యాక్ సెంటర్ లో అకాడమీ కార్యకలాపాలు పరిశీలించి శిక్షణా కార్యక్రమం పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ….నిర్మాణ రంగంలో నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. న్యాక్ లో శిక్షణ పొందితే పాలిటెక్నిక్ డిప్లొమా సమానం అన్నారు. భవిష్యత్తు అంతా ఎఐ తో ముడిపడి ఉండటంతో అత్యంత ఆధునిక టెక్నాలజీతో జరిగే శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుతానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నగేష్ రెడ్డి, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రాంభూపాల్, గడిల రాములు పాల్గొన్నారు.

More articles

Latest article