26.2 C
Hyderabad

జంటతో అసభ్యంగా ప్రవర్తించి . . . డబ్బు స్కూటి లాక్కున్న నిందితుడి అరెస్టు

Accused arrested for behaving indecently toward a couple and forcibly taking their money and scooter

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిర్మానుష్య ప్రాంతంలో తిరిగే జంటలను వేదించడం వారి వద్ద ఉన్న బంగారు నగలను, వాహనాలను లాక్కోవడంలో ఆరితేరిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ 5వ టౌన్ ఎస్సై సునీల్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని న్యాల్ కల్ రోడ్డులో గల స్మార్ట్ సిటీ వెంచర్‌లో ఒక మహిళ తన కాబోయే భర్తతో ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తూ మహిళను వేధించి, ఆమె చేయి, చున్నీని లాగి అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాకుండా, వారి వద్ద ఉన్న రూ.4,000 నగదుతో పాటు స్కూటీని బలవంతంగా లాక్కొన్న సంఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు 5వ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఎస్సై సునీల్ నిందితులైన గోడనే గణేష్, ప్రమోద్, పరమేశ్వర్‌లలో ప్రధాన నిందితుడైన గోడనే గణేష్‌ను శుక్రవారం అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మిగతా నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.గోడనే గణేష్ పై గతంలోనూ చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పోలీసు యూనిఫాం ధరించి దోచుకున్న కేసుతో పాటు నకిలీ కరెన్సీ, బలవంతపు వసూళ్ళకు గణేష్ సూత్రదారి అని తెలిసింది.

More articles

Latest article