26.2 C
Hyderabad

జీరో చిట్టి ల దందాలో సర్కార్ బడి సార్

Government school in zero-sum game

Must read

📰 Generate e-Paper Clip

 

. . . చిట్టిలపేరుతో రెండు కోట్ల వంచన

 

. . . 33 మందికి ఐ పీ నోటీసులు

 

 నిజామాబాద్, బతుకమ్మ:

 

అతను ఒక జిల్లాపరిషత్ హై స్కూల్ స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) బోధించే ఉపాధ్యాయుడు.. పేరుకులెక్కల మాస్టర్ అయినప్పటికి అతనికి పైసల లెక్కలు బాగా తెలుసు. అందుకే పేరుకు వృత్తిరిత్యా గవర్నమెంట్టీచర్ అయిన తెలిసిన వారందరి తో కలిసి జీరో చిట్టిల దందాకు తెరలేపారు. నవిపేట్ మండలఎమ్మార్సీ పరిధిలోని ఒక ఉపాధ్యాయుడు చేసిన ధర్జగా  చిట్టీలపేరుతో దాదాపు రెండు కోట్ల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసినట్లు వెలుగులోకివచ్చింది. అయితే అతను కొంతకాలంగా చట్ట విరుద్ధంగా నమ్మకస్తులైన స్థానికులు, సహచరఉపాధ్యాయులు ఇతరుల నుంచి పెద్ద ఎత్తున చిట్టిల రూపంలో డబ్బులు వసూలు చేశారు.అతనిని నమ్మి చాలామంది బాధితులు తమ కష్టార్జితాన్ని అతనికి అప్పగించారు. ఇటీవలచిట్టీలు గడువు ముగిసినప్పటికీ, బాధితులకు చెల్లించాల్సిన అసలు, వడ్డీ డబ్బులుఇవ్వకుండా ఉండడంతో బాధితులు నిలదీశారు. అధికారిక అనుమతులు లేని ప్రైవేటు చిట్టీలవ్యాపారం పేరిట భారీ మోసానికి పాల్పడి , ఆపై బాధితులకు కోర్టు నుంచి ఐ పి దివాలా పిటిషన్నోటీసులు పంపించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ బిజినెస్ అనే వ్యాపారంతోచిట్టీలు నడుపుతూ మోసం చేస్తున్న  గురువునుసస్పెండ్ చేసి జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే క్రమశిక్షణ చర్యలుతీసుకోవాల్సిందిగా పలువురు కోరుతున్నారు

More articles

Latest article