- డీపీఓ.శ్రీనివాస్ రావు
భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంటున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటించాలని డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంపిడీఓ గంగుల సంతోష్ కుమార్ తో కలిసి మండలంలోని బాబానగర్ హాబిటేషన్ తాళ్లకుంట, పురానిపేట్ గ్రామాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా పారిశుధ్య పనులను, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ డీపీఓ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటి భాద్యత పరిరక్షించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతను గురించి ప్రజలకు వివరించాలని సీజనల్ వ్యాదులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను వేగవంతంగా పూర్తి అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన ఆరోగ్య సిబ్బందితో రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్. అజయ్, మిషిన్ భగీరథ ఏ. ఈ అమూల్య, ఎంపీఓ శివ్ చరణ్, ఏ పీ ఓ నర్సయ్య, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
