గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటాలి
డీపీఓ.శ్రీనివాస్ రావు భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంటున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటించాలని డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంపిడీఓ గంగుల సంతోష్ కుమార్ తో కలిసి మండలంలోని బాబానగర్ హాబిటేషన్ తాళ్లకుంట, పురానిపేట్ గ్రామాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా పారిశుధ్య పనులను, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ డీపీఓ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా...