29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా వైయస్సార్ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలో వైయస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జయంతి వేడుకలు పిట్లం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమాన్లు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆదుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగండ్ల శ్రీనివాస్ రెడ్డి, బొడ్ల రాజు, సలీం, లోక సంతోష్, నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article