మోర్తాడ్, బతుకమ్మ: ఉద్యోగ జీవితంలో బదిలీలు సర్వసాధారణమని ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేయాలని సమాజంలో మంచి గుర్తింపు పొందాలని మోర్తాడ్ తాసిల్ ల్దార్ కృష్ణ అన్నారు. మోర్తాడ్ మండలంలో డిప్యూటీ తాసిల్దారుగా పనిచేసిన సుజాత ఆర్మూర్ కు బదిలీ పై వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ గీర్మాజీ గోపి ఆధ్వర్యంలో ఆమెను శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేయడం జరిగింది. అదేవిధంగా ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మోతె సుభాష్, సుదం, పెండం శ్రీనివాస్, తక్కురి సతీష్, యాటమ్ విజయ్, చిట్టి నరేష్, గిర్మాజీ గంగాధర్, గుర్రం అశోక్, పెద్ది రామకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
