ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణం

మోర్తాడ్, బతుకమ్మ: ఉద్యోగ జీవితంలో బదిలీలు సర్వసాధారణమని ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేయాలని సమాజంలో మంచి గుర్తింపు పొందాలని మోర్తాడ్ తాసిల్ ల్దార్ కృష్ణ అన్నారు. మోర్తాడ్ మండలంలో డిప్యూటీ తాసిల్దారుగా పనిచేసిన సుజాత ఆర్మూర్ కు బదిలీ పై వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ గీర్మాజీ గోపి ఆధ్వర్యంలో  ఆమెను శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేయడం జరిగింది. అదేవిధంగా ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మోతె సుభాష్,  సుదం, పెండం శ్రీనివాస్,...