ఎల్లుండి నుంచి ట్రాఫిక్ డైవర్షన్

0 2,430

. అడవి మామిడిపల్లి వద్ద రోడ్డు మూసివేత

. నెల రోజులపాటు వాహనాల దారి మళ్లింపు

నిజామాబాద్, బతుకమ్మ: రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయనున్న నేపథ్యంలో అడవి మామిడిపల్లి వద్ద రోడ్డును ఈనెల 10 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు మూసివేయనున్నారు.  ట్రాఫిక్ మళ్లింపు అమలులోకి వస్తుందని, వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. నిజామాబాద్ నగరం నుంచి ఆర్మూర్ వైపు వెళ్లే వాహనాలు డిచ్ పల్లి నేషనల్ హైవే 44 మీదుగా ఆర్మూర్ కు చేరుకోవాలని, అలాగే ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వైపు వచ్చే వాహనాలు ఇదే రూట్ లో చేరుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్మూర్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిన్నాపూర్, కల్లెడి, ఆలూర్ మీదుగా ఆర్మూర్ చేరుకోవాల్సి ఉంటుందని, ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వైపు వచ్చే బస్సులు ఇదే రూట్ లో జిల్లా కేంద్రానికి చేరుకుంటాయన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.