27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

లింబాద్రి గుట్టపై టూరిజం హోటల్ మంజూరు

Must read

📰 Generate e-Paper Clip

  • సాంక్షన్ చేయించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
  • మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బోదిరే స్వామి

 

భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షణ బద్రిగా పిలువబడే లింబాద్రి గుట్ట పై టూరిజం హోటల్ హరితను పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సాంక్షన్ చేయించారని మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బోదిరే స్వామి తెలిపారు. శుక్రవారం ఆయన మండల పార్టీ కార్యక్రమంలో మీడియా తో మాట్లాడుతూ రూ. 4కోట్ల నిధులను పర్యాటక శాఖ నుండి టూరిజం హోటల్ నిర్మాణం పనులకు గాను సాంక్షన్ చేయించారని అన్నారు. భక్తుల సౌకర్యార్థం ఈ హోటల్ సాంక్షన్ చేయించేందుకు కృషి చేసి కానిస్టెన్సీ పార్టీ ఇంచార్జ్  ముత్యాల సునీల్ కుమార్ గారికి.టీజీఎండీసీ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ ,సహకార యూనియన్ కార్పొరేషన్ చైర్మన్,నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి .సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెజె నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్,జిల్లా కార్యదర్శి బొజ గౌడ్,మాజీ ఎంపీపీ కన్నె సురేందర్,యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బద్దం అవినాష్, సుంకరి సురేష్,రాజేష్,మహేష్,శ్రీను,చిన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article