- లంచం తీసుకుంటు పట్టుబడిన కార్మిక శాఖాధికారులు
- లంచం అడిగిన ములుగు డిప్యూటీ తహసీల్దార్ పై కేసు
- పాల్వంచ మున్సిపాల్టి కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలో లెక్కలో లేని నగదు స్వాధీనం
హైద్రాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఆరు నెలల్లో 120 మందికిపైగా అవినీతి అధికారులను పట్టుకుంది. ఐనప్పటికీ లంచాలు తీసుకోవడం మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం ఒక్కరోజే నాలుగు ప్రాంతాలలో దాడులు చేసింది. ముగ్గురు అధికారులు లంచాలు తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుబడగా, ఒక చోట ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. లంచం అడిగినంధుకు ములుగు డిప్యూటీ తహసీల్ధార్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
- 50 వేలు లంచం తీసుకుంటు మంచిర్యాల లేబర్ ఆఫీసర్..

మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ఏసీబీ అధికారులు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ను రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. మంచిర్యాల అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కాటం రామ్ మోహన్ సిర్పుర్ కాగజ్ నగర్ ఫుల్ అడిషనల్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. రిజిస్టర్డ్ కార్మికుడు ఒకరు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడంతో లేబర్ విభాగం ద్వారా దహన సంస్కారాలకు సాయం అందించడంతో పాటు కుటుంబానికి చేయూతనిచ్చేందుకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే రూ.50 వేలు ఇస్తేనే ఇందుకు సంబంధించిన ఫ్రతిపాదనలు పంపిస్తానని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కాటం రాంమోహన్ తేల్చి చెప్పారు. దీంతో మృతుని సోదరుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శుక్రవారం రూ. 50 వేలు తీసుకుంటుండగా రెడ్ హైండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
- బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కుడా..

సాధారణ మరణం చెందిన ఓ కార్మికునికి ప్రభుత్వం తరుపున రావల్సిన రూ. 1.30 లక్షల ఆర్థిక సాయం అందించే విషయంలో రూ. 40 వేలు ఇవ్వాలని బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుకన్య డిమాండ్ చేశారు. చివరకు రూ.30 వేలు ఇస్తే ఇందుకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేస్తానని మాట ఇచ్చారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించడంతో శుక్రవారం రూ.30 వేల నగదును అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుకన్య తన అసిస్టెంట్ రాజేశ్వరి ద్వారా లంచంగా తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇద్దరిని కూడా కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు ఏసీబీ అధికారులు.
- లంచం అడిగినందుకు డిప్యూటీ తహసీల్దార్ పై కేసు..

వ్యవసాయ భూమికి సంబంధించిన పాసు పుస్తకం ఇచ్చేందుకు అవసరమైన ప్రాసెస్ చేసేందుకు డిప్యూటీ తహసీల్ధార్ డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడు ఆదారాలతో సహ ఏసీబీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా ములుగు డిప్యూటీ తహసీల్దార్ యెలగందుల భవాని రూ. 2 లక్షలు డిమాండ్ చేసి నందుకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
- పాల్వంచ బల్ధియాలో ఏసీబీ ఆకస్మీక తనిఖీలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మునిసిపాలిటీలో ఖమ్మం ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. శుక్రవారం ఎసిబి జరిపిన ఆకస్మీక సోదాల్లో రూ.40,765 నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదు లభ్యమైన అధికారులకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి చర్యలకు సిఫారసు చేశారు.
