రేపో మాపో బల్దియా నగారా….

0 8,529

ఏర్పాటు చేస్తున్న ఎన్నికల అధికారులు

 

హైదరాబాద్ బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. ఈ నెల 17 న మున్సిపాలిటీల, కార్పోరేషన్ ల రిజర్వేషన్ ల ఖరారు అయిన నేపత్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది. రాష్ట్రంలో బల్దియ ఎన్నికలలో ప్రచారమే లక్ష్యంగా సి యం రేవంత్ రెడ్డి పలు జిల్లాల పర్యటన చెప్పటిన విషయం తెలిసిందే. ఇదివరకు ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల పర్యటన పూర్తైన నేపత్యంలో రేపో మాపో మున్సి పోల్ కు అధికారులు షెడ్యూలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా వ్యవహారం కొలిక్కి రాగా పోలింగ్ బూతుల పెంపుదల కూడా జరిగింది. డివిజన్ లు, వార్డుల సంఖ్య పెరగకపోయినా ప్రస్తుతానికి ఉన్న డివిజన్ లలోనే పెరిగిన ఓట్లను పెంచి రిజర్వేషన్ లను ఖరారు చేసిన ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సిదమైంది.
రాష్ట్రంలోని 10 మునిసిపల్ కార్పోరేషన్ లు, 121 మున్సిపాలిటీలు ఉండగా అందులో జి.హెచ్.ఎం.సి. మినహా మిగిలిన అన్ని కార్పోరేషన్ లు బల్దియాలలో ఎన్నికల నగారా మోగనుంది. ఫిబ్రవరి మొదటి వారం లోనే ఎన్నికలు జరగనున్నాయి. 9 లేదా 10 తేదీలలో ఎన్నికలు జరిగే విధంగా షెడ్యూలు ఖరారు కానుంది. ఫిబ్రవరి 18 తర్వాత ఇంటర్ మీడిఎట్ పరీక్షలు ఉన్న నేపధ్యంలో అంతకు ముందే ఎన్నికలను పూర్తీ చేసేందుకు ఖసరత్తు పూర్తీ చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పలువురు ఐ.పి.యస్ లను ఐ.ఎ.యస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎన్నికల కోడ్ కు ముందే అధికారుల స్థాన చలనం ప్రక్రియను పూర్తీ చేశారని చెప్పాలి. ఇటీవల ప్రభుత్వం కూడా బల్దియా ఎన్నికలను పరిగణలోకి తీసుకొని మున్సిపాలిటీలలో కార్పోరేషన్ లకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి పనులను ప్రారంబించింది. ఎన్నికలకు ముందుగా అధికార పార్టీ చేపట్టిన డెవలప్ మెంట్ పనులు ఏమేరకు పలితాలనిస్తాయో వేచి చూడాలి.
బల్దియా ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీల గుర్తు ఆధారంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో మున్సిపాలిటీలలో పాగా వేసేందుకు అన్ని పార్టీలు సిద్దమయ్యాయి. మున్సిపల్ ఎన్నికలలో ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల మాదిరిగా కాకుండా ఎక్కువ కార్పోరేషన్ లు మెజారిటీ మున్సిపాలిటీలు కైవసం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ పంచాయితీ కంటే మున్సిపల్ పైనే ఆశలు పెట్టుకున్నాయి. పంచాయితీ ఎన్నికలలో బి ఆర్ యస్ దీటుగా స్థానాలను గెలుచుకోగా పంచాయితీలలో తొలిసారి కమలం పార్టి పాగా వేసిన విషయం తెలిసిందే. పంచాయితీ ఎన్నికలలో బి.సి. రిజర్వేషన్ లు అమలుకు అడ్డంకులు ఏర్పడగా మున్సిపాలిటీలలో మాత్రం కాంగ్రెస్ పార్టి ఎక్కువ స్థానాలను బి.సి.లకు ఇచ్చి ఓట్లు అడగాలని నిర్ణయించింది. అయితే రిజర్వేషన్ ల అమలుకు వచ్చే సరికి బి.సి.లు ఎక్కువగా కేటాయించిన స్థానాలలో మహిళలకు లేదా బి.సి.లు తాకువగా ఉన్నా ప్రాంతాలలో కేటాయించారని, మైనారిటీలకు ఎక్కువగా ఉన్నా ప్రాంతాలలోను బి.సి.లకు స్థానాలు రిజర్వేషన్ లు చేశారన్న వాదనలు ఉన్నాయి. బి.ఆర్.యస్ తో పాటు ఈసారి మున్సిపల్ ఎన్నాకలలో తెలంగాణా వాదాన్ని గట్టిగా వినిపించేందుకు జాగృతి బరిలో ఉండడం కారు పార్టీకి ఎఫెక్ట్ తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ, యం.పి., యం.ఎల్.సి. స్థానాల్లో అధికార పార్టీకి దీటుగా గెలిచినా కమలం పార్టీ బల్దియా పై పట్టును నిలుపుకునేందుకు ముదస్తుగానే ఏర్పాట్లు చేసుకుంది. పతంగి పార్టీ పోటీ గట్టిగానే ఇస్తున్నప్పటికీ అది అధికార పార్టీకి మద్దతు తెలుపుతుందని చర్చ జరుగుతుంది. కామ్రేడ్ లు అధికార పార్టీ కి మద్దతు ఇస్తుండడం ఇప్పుడు చర్చనీయంశామైంది. కామ్రేడ్ లు, మజ్లిస్ పార్టీ మద్దతుతో ఎక్కువగా గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది.

Leave A Reply

Your email address will not be published.