. . . ట్రాలర్ – ఎర్టిగా కారు ఢీకొని నలుగురు దుర్మరణం
. . . చావు బ్రతుకుల మధ్య కుప్టి సర్పంచ్
. . . స్వల్ప గాయాలతో తప్పించుకున్న ఇద్దరు వ్యక్తులు
బైంసా, బతుకమ్మ :
నిర్మల్ జిల్లాలో బైంసా సుద్ధ వాగు బ్రిడ్జి వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ యంత్రాలు తరలించే ట్రైలర్ ను ఎర్టిగా కారు ఎదురెదురుగా డికోట్టుకోవడంతో ఘటన స్థలంలో నలుగురు స్పాట్ డేడ్ అయ్యారు. మరో వ్యక్తి చావు బ్రతుకుల మధ్య నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు….. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ ఇద్దరు బాధితులు సిందే ఆనంద్ రావ్, లక్ష్మణ్ తెలిపిన కథనం ప్రకారం ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం లోని కుప్టి సర్పంచ్ గంగాధర్ తో పాటు బోజ రాం పాటిల్, కోడి మాల పెద్ధ రాజన్న, బోయిడి బాబన్న,ఆనంద్ రావు, లక్ష్మణ్ తో పాటు కుబీర్ మండల కేంద్రానికి చెందిన డ్రైవర్ వికాస్ తో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న కుప్టి గ్రామస్థుడిని పరామర్శించేందుకు వెళ్లారు. సోమవారం ఉదయం వెళ్లిన వీరందరూ రాత్రిపూట తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న ఏర్టిగా వాహనం మరి కొన్ని నిమిషాల వ్యవధిలో బైంసా కు చేరుకునే సమయంలో ప్రమాదానికి గురైంది. సుద్దవాగు వంతెనపై ఎదురెదురుగా వస్తున్న ట్రాలీ లారీ ఏర్టిగా వాహనం ఢీ కొట్టుకున్నాయి ఘటనలో ట్రాలీ లారీ పై నున్న భారీ పరికరానికి తగిలిన ఏర్టిగా వాహనం నుజ్జునుజ్జయింది.

దీంతో కుబీర్ మండల కేంద్రానికి చెందిన కారు డ్రైవర్ వికాస్ బొప్ప, మధ్య సీట్ కుడి భాగంలో కూర్చున్న భోజ రామ్ పటేల్ వెనుక సీట్లో కూర్చున్న మరో ఇద్దరు కొడిమెల పెద్ద రాజన్న, బోయిడి బాబన్న తల మొండెం నుంచి వేరుపడి ఘటన స్థలం లోనే దుర్మరణం పాలయ్యారు. ఇక మధ్య సీట్ల మధ్య భాగంలో కూర్చున్న గ్రామ సర్పంచి గంగాధర్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వేనుక సీట్లలో కూర్చున్న ఆనంద్ రావు, లక్ష్మణ్ లో స్వల్ప గాయాలతో ప్రాణాలతో బతికి బయటపడ్డారు.క్షతగాత్రుడిని భైంసా లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న బైంసా ఏ ఎస్పీ రాజేష్ మీనా, సీఐ సాయి కుమార్ లు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను ట్రాలీ ఆటోలు పోస్టు మార్గం నిమిత్తం ఇక్కడి ఆసుపత్రికి తరలించారు. అనంతరం రోడ్డు పైనున్న రెండు వాహనాలను జేసీబీ ద్వారా పక్కకు తొలగించారు.

పోలిస్ శాఖ జాతీయ రోడ్డు భధ్రత మాసోత్సవాలను అలైవ్ -ఆరైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాధం జరుగడం దారుణం.. సుద్ధవాగు బ్రిడ్జీ పై జరిగిన రోడ్డు ప్రమాదానికి మీతి మీరిన వేగంతో పాటు మద్యం మత్తు కారణం అని తెలిసింది..