27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: పదవ తరగతి లో సాధించిన ఫలితాలతో ఆగకుండా పై చదువులలో రాణిస్తూ జీవితంలో ఇంకా ముందు ముందు మంచి స్థానంలో ముందంజలో ఉండాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాలరావు అన్నారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి లో ఫలితాల్లో మంచి ప్రతిభ చూపించిన విద్యార్థులను గురువారం శాలువాతో సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఇందులో 528 మార్కులు సాధించిన M. శ్రీజ, 511 మార్కులు సాధించిన పుష్పాంజలి, భాస్కర్ 454, శివకుమార్ 430, అనిల్ కుమార్ 398  విద్యార్థుల మంచి ప్రతిభ చూపించారు. పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ వసంత,, మాజీ ఎంపిటిసి T. శ్రీనివాస్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆశన్న గారి రవి, కుంట. రాజు,బద్దం.రవి, నూకల. రవి, కూన.కిరణ్, మహిపాల్, ఆదర్శ రైతు కుంట.శ్రీనివాస్ ఉపాధ్యాయులు మహేష్ కుమార్, నరసింహ స్వామి  రాజేందర్, నచ్చయ్య  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article