28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆలోచించి లక్ష్యం వైపు అడుగులు వేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముగింపు లో జిల్లా జడ్జి భరత లక్ష్మి

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి… విద్యార్థినీలు తాము నిర్దేశించుకున్న లక్ష్యం కోసం ఆలోచించి అడుగులు వేయాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్. భరత లక్ష్మీ  అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య ఆధ్వర్యంలో ఏప్రిల్ 25 నుండి మే 2 వరకు ఫ్రీ పోలీస్ సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమం కు ముఖ్య అతిధులుగా నిజామాబాద్ జిల్లా జడ్జి జి.వి. ఎన్. భరత లక్ష్మీ హజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ తల్లి, దండ్రులు, చెప్పిన మాటలు విని వాటిని మనము అలవాటు చేసుకున్నప్పుడు మనం ఇతరులతో ఎలా మాట్లాడాలో మంచి మెలకువలు నేర్చుకోగలిగిన వారము అవుతామన్నారు. విద్యార్థినీలు చదువుకునే సమయంలో ఎక్కువగా ఈవ్ టీజింగ్ ఇబ్బందులు ఉంటాయి. అందుకోసం మనం ఏం చేయాలి. ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ఈ సమ్మర్ క్యాంప్ లో నేర్చుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. భవిష్యత్తులో కెరీర్ బిల్డప్ చేసుకోవాలని, క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలని తెలిపారు. అయితే ఇందులో కెరీర్ బిల్డప్ కన్న ,క్యారెక్టర్ బిల్డప్ జీవిత కాలం ఉపయోగపడుతుందన్నారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్ కు ప్రతి ఒక్కరూ బానిస అవుతున్నారు సెల్ ఫోన్ వదిలివేయాలి, సెల్ఫోన్లను ఎంత దూరం పెడితే మీకు అంత మంచిది తెలిపారు. సెల్ ఫోన్ ఉపయోగం వల్ల మంచి ,చెడు రెండు ఉంటాయన్నారు. మంచి కన్న చెడు ఎక్కువగా ప్రభావితం అవుతున్నందున ఎంత తక్కువ ఉపయోగిస్తే అంత మంచిదన్నారు. పర్సనల్, ప్రైవసీ రెండు ఉంటాయి పర్సనల్ ఎంత ముఖ్యమో ప్రైవసీ కూడా అంతే ముఖ్యమన్నారు. రోజువారీగా మనం నేర్చుకున్నది ఇతరులకు తెలపడం ద్వారా మంచి భవిష్యత్తు లో స్థిరపడతారు తెలిపారు. ఇలాంటి సమ్మర్ క్యాంప్ లు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని  అన్నారు.

Think and take steps towards the goal.

పోలీస్ కమిషనర్  సాయి చైతన్య మాట్లాడుతూ బాలిక లు సమాజంలో ఎలా ఉండాలనే విషయాల ను ఈ క్యాంప్ లో నేర్చుకున్నారని విద్యార్థినీలకు తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునేందుకు సెల్ఫ్ మోటివేషన్ తరగతుల ద్వారా ఎన్నో నేర్చుకున్నారని, తైక్వాండో ,సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తో వారిని వారు రక్షించుకోవడానికి పలు మెలకువలు నేర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని అపాయం జరిగితే స్పందించాలని చూసిన వాటిని చెప్పేందుకు ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు. ప్రతీ ఒక్కరు అన్నింటిలో మంచి స్కిల్స్ పెంపొందించుకోవాలని మంచిగా ఆలోచించి విద్యార్థులు లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా ఆలోచన దృక్పథం విద్యార్థినీలకు పెరిగి కొంతమేర మార్పు దిశగా అడుగులు వేయడం శుభపరిణామం అన్నారు.

Think and take steps towards the goal.

ప్రి సమ్మర్ క్యాంప్ లో  విద్యార్థినిలు నేర్చుకున్న మెలకువలను ప్రదర్శించారు. ఈ ఫ్రీ సమ్మర్ క్యాంప్ లో శిక్షణ పొందిన వారికి ముఖ్య అతిథి జిల్లా జడ్జీ భరత లక్ష్మి, కమీషనర్ సాయి చైతన్యలు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐ.పి.ఎస్. సాయి కిరణ్ నిజామాబాద్ సౌత్ రూరల్ సి.ఐ సురేష్ కుమార్, రిటైర్డ్ ఇన్స్పెక్టర్  కిషన్, తైక్వాండో ట్రెయినర్  మనోజ్, జె.సి.ఐ సభ్యులు  విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.

Think and take steps towards the goal.

More articles

Latest article