నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ మహనీయుల పార్కులో గల కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్థంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకుడు కార్య దీక్షా పరుడు గొప్ప ఉద్యమ నేత బిసి ముద్దుబిడ్డ అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కొరకు చేసిన త్యాగాలను మరువలేనివన్నారు. ఒక శాసనసభ్యుడిగా, శాసనసభ ఉపనేతగా, మంత్రిగా, ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలందించి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణ వచ్చిన తర్వాతనే పదవులు తీసుకుంటానని శపథం చేసిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. తొంభై ఏళ్ల వయసులో కూడా విశ్రాంతి తీసుకోకుండా బస్సు యాత్ర చేసి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ ఉద్యమ పాఠాలు నేర్పిన గొప్ప నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఆనాడు స్వాతంత్రోద్యమంలో కానీ తెలంగాణ తొలి ఉద్యమంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాలు పంచుకుని ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ అని అన్నారు. తన ఇంటిని తెలంగాణ ఉద్యమాలకు పుట్టినిల్లుగా మార్చి ఎందరికో వేదికగా తన ఇంటిని మార్చిన గొప్ప మార్గదర్శి కొండాలక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు, దర్శనం దేవేందర్, కొట్టూర్ చంద్రకాంత్, బగ్గలి అజయ్, సాయి బసవ, కోడూరు స్వామి, గంగాధర్, అంకం రావు, మురళి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
