. . . ఆంధ్ర నుంచి గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు చేసిన నార్కోటిక్ పోలీసులు
. . . మునావర్ ఆలీకి గంజాయి రవాణా చేస్తుండగా కేసు
. . . గతంలో గంజాయి రవాణా లో మునావర్ ఆలీ పై పిడి యాక్టు
వరంగల్ , బతుకమ్మ:
వరంగల్, ఖమ్మం జిల్లా ల నార్కోటిక్ ఠాణాలో నిజామాబాద్ కు చెందిన మునావర్ ఆలీ పై కేసు నమోదైంది. మత్తు పదార్థాల అక్రమ రవాణాను నిరోధించేందుకు గత ఎడాది ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాకు సంబంధించిన నార్కోటిక్ పోలిస్ స్టేషన్ ను ఏర్పాటు చేయగా అందులో గురువారం తొలి కేసు నమోదైంది. డీఎస్పీ సైదులు తెలిపిన కథనం ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నేరేళ్ల సదయ్య అలియాస్ సతీష్, హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన సామల శేషులు రెండు కార్లు 147.3 కిలోల గంజాయి తరలిస్తుండగా వరంగల్ నార్కోటిక్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా సుకుమామిడి గ్రామంలో సోమరాజు వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ నగరానికి చెందిన మునావర్ ఆలీకి విక్రయించుటకు వరంగల్ మీదుగా వెళ్తుండగా రెడ్ హ్యాండేడ్ గా పట్టేశారు. గంజాయి విక్రయించిన ఆంధ్రకు చెందిన సోమరాజు, నిజామాబాద్ కు చెందిన మునావర్ ఆలీ పరారీలో ఉండగా, రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు వరంగల్ నార్కోటిక్ డీఎస్పీ కే. సైదులు తెలిపారు. గత ఎడాది సైతం మునావర్ ఆలీపై గంజాయి రవాణా కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో పనిచేసిన కమీషనర్ కార్తికేయ హయంలో మునావర్ ఆలీ పై పిడి యాక్టు కేసు నమోదైంది. మజ్లిస్ పార్టీ లో ఉన్న మునావర్ ఆలీపై నార్కోటిక్ ఠాణాలో తొలి కేసు నమోదు కావడం నిజామాబాద్ నగరంలో చర్చనీయాంశంగా మారింది.