26.7 C
Hyderabad

గణేష్ నిమజ్జనానికి ఎస్సారెస్పీ నీటి విడుదల

SRSP water released for Ganesh immersion

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్, బతుకమ్మ :

గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువ ప్రాంతం కోసం నీటి విడుదల చేశారు. ఇటీవల కాలంలో గణేష్ నిమజ్జనానికి చెరువులు, కుంటలు, బావుల్లో నీటి నిల్వలు లేకపోవడంతో నిమజ్జనంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఎస్సారెస్పీ నీటి కోసం హిందూ సంఘాలు నీటి విడుదలను చేయాలని డిమాండ్ ను తెర మీదకు తెచ్చాయి.

SRSP water released for Ganesh immersion
 

గతంలో ఎస్సారెస్పీలో 17 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ నిమజ్జనం కోసం నీటి విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 80.5 టీఎంసీలకు గాను 46.654 టీఎంసీల నీరు ఉండడంతో ప్రభుత్వం నీటి విడుదలకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో సోమవారం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీరాంసాగర్ నుంచి కాకతీయ మెయిన్ కెనాల్ (ఎల్ఎండిఎగువ భాగం)లోకి నీటి విడుదల ప్రారంభించారు. అనంతరం నీటి ప్రవాహాన్ని క్రమంగా పెంచుతూ సాయంత్రానికి 3 వేల క్యూసెక్కులకు పెంచడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

More articles

Latest article