. . . ధనిక తెలంగాణ ను బికారి తెలంగాణ చేసిన ఘనత కేసీఆర్ దే
. . . ఫాం హౌస్ లో నుంచి ఇక కేసీఆర్ ఎప్పటికి రాడు
. . . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ :
తాను అప్పులు చేసి ఫామ్ హౌస్ లో పడుకుని తప్పించుకుని తిరగట్లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు తీరుస్తూ ప్రజల మద్యే దైర్యంగా తిరుగుతున్నానని, రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలన్ని మాఫీ చేశామని, రుణ మాఫీ కింద ఆరు నెలల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.22,600 కోట్లు జమ చేసినట్టు సీఎం వెల్లడించారు. మంగళవారం ఖరీఫ్ సీజన్ లో రైతులకు అందించే రైతు భరోసా ఆర్థిక సాయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో కలిసి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం వ్యవసాయం అంటే దండుగ కాదు పండుగ అనేలా పని చేస్తోందని తెలిపారు. ఎన్నికల ముందు రాష్ట్రంపై రూ.6 లక్షల కోట్లు అప్పు ఉంటుందని భావించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక లెక్కలు తీస్తే గుట్టల కొద్ది అప్పు బయట పడిందన్నారు. గత పాలకులు బడి పిల్లల తిండి బిల్లులు సైతం రూ.వేల కోట్లు బకాయిలు పెట్టి పోయాడన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని 19 మంది ముఖ్యమంత్రులు పాలించారని, 19 మంది సీఎం లు చేసిన అప్పు రూ.60 వేల కోట్లు ఉంటే తెలంగాణ వచ్చాక కేసీఆర్ చేసిన అప్పు రూ.8.11 లక్షల కోట్లు అయిందని ఆరోపించారు. కేసీఆర్ అప్పులు చేసి ఫాం హౌస్ లో బందీగా ఉన్నాడని, అతనెప్పటికి తిరిగి రాడని ఇది తన గ్యారంటీ అని అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతు బందు తొలి రోజు 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,482,02 కోట్లు జమ కానున్నాయి. ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల రైతుల కోసం రూ.878.94 కోట్లు, రెండెకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతుల కోసం రూ.1,603.08 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వర్షాకాలంలో సాగు పనులు మొదలయ్యే నాటికే రైతు భరోసా నిధులు అందిస్తున్నట్టు చెప్పారు. 30 నెలలుగా రైతు సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు.

