. . . పసుపు రైతులను దోచేస్తున్న ట్రేడర్లు
. . . ఈ నామ్ సాప్ట్ వేర్ అప్డేట్ మాటున వ్యాపారుల దోపిడి
. . . క్వింటాళ్ కు రూ.5 వేల వరకు దోపిడికి గురవుతున్న రైతులు
. . . నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ యార్డలో సిండికేట్ ట్రేడర్ల దందా
. . . ఆగ్రహ వేశాలతో ఏఎంసీని ముట్టడించిన పసుపు రైతులు
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ ను పసుపు రైతులు ముట్టడించారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన పసుపు రైతులు ఏఎంసీ కార్యాలయాన్నిబుదవారం ముట్టడించారు. కార్యలయంలోకి చోరబడి కుర్చీలను విరగోట్టారు. ప్రధాన గేట్ వద్ధ తమను అడ్డుకున్న పోలిసులతో కర్షకులు వాగ్వివాదానికి దిగారు. మార్కేట్ కమిటి చైర్మెన్ డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. చివరకు అక్కడ రైతులను సముదాయించేందుకు వచ్చిన మార్కేట్ సహయ కార్యదర్శిని నిలదిశారు. అన్ లైన్ వ్యవస్థ ఐనా ఈ నామ్ ద్వార యార్డులో జరుగాల్సిన క్రయ విక్రయాలను సాప్ట్ వేర్ లోపాల పేరుతో బహిరంగ వేలం నిర్వహిస్తు రైతులను దోచుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఎప్రిల్ మాసం మంచి పసుపు రకానికి క్వింటాళ్ కు 18 వేల నుంచి 23 వేల వరకు ధర దక్కాల్సిన సమయంలో రూ.11 వేలకు క్వింటాల్ ధర పలకడం ఎమిటని రైతులు మండిపడుతున్నారు. ఈ నామ్ ద్వార అయితే రిజిస్టర్డ్ ట్రేడర్లు పసుపు కోనుగోళ్లకు ముందుకు వచ్చే వారని గత నెల నుంచి సాప్ట్ వేర్ మోరాయిస్తుందని నలుగురు ఐదుగురు వ్యాపారులతో బహిరంగ వేలం ద్వార కోనుగోళ్లు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులను దోచుకునేందుకు వ్యాపారులు సిండికేట్ అయ్యారని, ఒక్కరు కోట్ చేసిన ధరకంటే ఎక్కువ ధరకు కోనుగోలు చేయవద్ధని కనుసైగలతో యార్డులో కోనుగోళ్లు జరుగుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. వ్యాపారులకు, అధికారులు తోడు కావడంతో నెల రోజులుగా యార్డులో ఈ నామ్ 2.0 ద్వార జరుగుతున్న కోనుగోళ్లు లోప భూయిష్టంగా ఉన్నాయని రైతులు ఆగ్రహవేశాలకు లోనయ్యారు. ఏఎంసీ ముట్టడించి ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు.

నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ కు పసుపు నిత్యం వంధల క్వింటాళ్లు తరలివస్తుంది. జనవరి చివరిలో ప్రారంభమయ్యే పసుపు క్రయ విక్రయాలు ఎప్రిల్ మాసంలో జోరుగా సాగుతుంది.ఇదే సీజన్ మంచి పసుపు రకానికి క్వింటాళ్ కు రూ.26 వేల ధర పలికిన దాఖాలు ఉన్నాయి. అందుకు కారణం లేకపోలేదు. నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ యార్డులో రైతుల నుంచి దళారులు లేకుండా కోనుగోలుకు ఈ నామ్ వ్యవస్థ ఉంది. ఈ నామ్ 1.0 ద్వార జరిగే పసుపు కోనుగోళ్లు దేశంలో ఎక్కడేక్కడో నుంచి సుమారు 60 నుంచి 80 మంది వ్యాపారులు ఆన్ లైన్ లో ధరను కోట్ చేస్తే ప్రభుత్వం ప్రకటించే మోడల్ ధరపైచిలుకు కోంటారు. దాని వలన మార్కేట్ కు ఆదాయం, రైతులకు రాబడి ఉంటుంది. అంతే గాకుండా దేశంలోనే జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ లోనే ఉంది. రైతులు పండించే మెలిమి రకానికి ధర రూ.25 వేలకు తగ్గకుండా వస్తుందని రైతులు ఆశతో ఉన్నారు. చాల మంది రైతులు పసుపు సీజన్ ప్రారంభం కంటే ఎప్రిల్, మే మాసంలోనే అమ్ముకోవాడానికి అసక్తి చూపుతుంటారు.

అప్పటి వరకు పసుపును ఉడకబెట్టి మాయిశ్చరైజర్ వచ్చే వరకు కోల్డ్ స్టోరేజీలలో, ఇండ్ల వద్ధ నిల్వ ఉంచి మోడల్ ధర పెరుగుతున్నట్టు కనిపించగానే మార్కేట్ కు పసుపు ను తరలించే సంప్రాధాయం కోనసాగుతుంది. పసుపును పచ్చ బంగారంగా అభివర్ణించే రైతులు దాదాపు తోమ్మిది మాసాలు పండించి తీసుకువచ్చిన పసుపునకు కనీస మద్ధత్తు ధర లేకపోవడంతో రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారు..

నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ కు వస్తే రైతులు నిలువుదోపిడికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. మార్కేట్ ఫీజు క్వింటాళ్ కు రూ.2 చోప్పున వచ్చే ఆదాయం ద్వార ప్రతి ఎడాది మార్కేట్ కు రూ.11 నుంచి 13 కోట్ల ఆదాయం వస్తుంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ కు ప్రధాన ఆదాయ వనరు పసుపు క్రయ విక్రయాలే. అయితే మార్కేట్ యార్డులో రైతులు నష్టపోకుండా జరుగాల్సిన ఈ నామ్ విక్రయాల్ కేవలం సీజన్ లోనే మోరాయించడం ట్రేడర్లు సిండికేట్ గా మారి దోచడం ఆనవాయితిగా వస్తుంది. ట్రేడర్లు, పాలకవర్గం, అధికారులు కుమ్మక్కై ఆన్ లైన్ లో జరుగాల్సిన పసుపు కోనుగోళ్లు బహిరంగ వేలం అనే ప్రక్రియకు తెర దిస్తారనేది ప్రధాన ఆరోపణ. ప్రతిసీజన్ లో ఎవ్వరి వాటాలు వారికి వేలుతాయని అందుకే రైతులు నిలువుదోపిడికి గురవుతున్న సాప్ట్ వేర్ లోపాలునెలల కోద్ధి సరిచేయడం లేదని పసుపు రైతులు మండిపడుతున్నారు. నామ్ వ్యవస్థ, జాతీయ పసుపు బోర్డు వ్యవస్థ ఉండగా రైతులను ట్రేడర్లు సిండికేట్ గా మారి దోచుకుంటున్నారని వారి ఆగ్రహనికి కారణం అని చెబుతున్నారు. నిజామాబాద్ రాజకీయ ముఖ చరిత్రను మార్చిన పసుపు రైతులు యార్డులో జరుగుతున్న దోపిడిపై మళ్లి పోరుబాట పట్టడంతో అధికార పార్టి నేతలకు ముచ్చేమటలు పడుతున్నాయి. బుదవారం రాత్రి మార్కేట్ యార్డు అధికారులు ఈ నామ్ ద్వార గురువారం నుంచి కోనుగోళ్లు చేస్తామని ప్రకటించారు. మరి సాప్ట్ వేర్ లోపాలను అదిగమించి క్రయ విక్రయాలు చేస్తారో వేచి చూడాలి.