నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి ఒక కానిస్టేబుల్‌పై రౌడీషీటర్ కత్తితో దాడి చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దారుణ ఘటన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ పురోహిత్ గాంధీ చౌక్ వద్ద నగరమంతా నిందితుల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా సంజయ్ పురోహిత్ మాట్లాడుతూ.. “ఈ విషయం హిందూ లేదా ముస్లిం అంశం కాదు. ఇది మన సమాజం, మన కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోయిన ఘటనగా తీసుకోవాలి. పోలీస్ శాఖకు సహకరించి ఈ దుష్టులను పట్టుకునేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి” అని తెలిపారు. కానిస్టేబుల్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ, “మేము 24 గంటలూ వారి సేవలో ఉంటాము” అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విట్టల్, మనోజ్, మున్నా గౌడ్, శ్రీకాంత్, సుమన్, రోహిత్, శ్రీవణ్, ఈశ్వర్, కృష్ణ, సంగద్, సాయి, మరెందరో పాల్గొన్నారు.


