కానిస్టేబుల్‌పై రౌడీషీటర్ కత్తితో దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి ఒక కానిస్టేబుల్‌పై రౌడీషీటర్ కత్తితో దాడి చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దారుణ ఘటన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ పురోహిత్ గాంధీ చౌక్ వద్ద నగరమంతా నిందితుల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా సంజయ్ పురోహిత్ మాట్లాడుతూ..  “ఈ విషయం హిందూ లేదా ముస్లిం అంశం కాదు. ఇది మన సమాజం, మన కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోయిన ఘటనగా తీసుకోవాలి....