29.3 C
Hyderabad

ఐచర్, బొలేరో వాహనాలు ఢీ..

Must read

📰 Generate e-Paper Clip

  • ట్రాఫిక్ కు అంతరాయం

 

రుద్రూర్, బతుకమ్మ : బోధన్ నుండి రుద్రూర్ వైపుకు వెళ్లే ప్రధాన రహదారి పసుపు వాగు  బ్రిడ్జి వద్ద ఐచర్ –  బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. బ్రిడ్జి కి అడ్డంగా ఐచర్, వాహనం నిలిచిపోయింది. బొలెరో వాహనం బ్రిడ్జి కింద పడిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఐచర్ ను క్రేన్ సహాయంతో బ్రిడ్జి దగ్గర నుంచి జరిపే ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రిడ్జ్ కి అడ్డంగా ఐచర్ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు కిలోమీటర్ వరకు అటువైపు ఇటువైపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ద్విచక్ర వాహనం  కూడా వెళ్లడానికి మార్గం లేకుండా బ్రిడ్జ్ కు ఐచర్ వాహనం అడ్డుగా ఉండడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

Eicher and Bolero vehicles collide..

More articles

Latest article