25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు

Must read

📰 Generate e-Paper Clip

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

 

బతుకమ్మ, మోర్తాడ్: తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలను కల్పించబోతుందని రిజర్వేషన్ల పరంగా ఒక విప్లవాన్ని తీసుకురాబోతుందని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మోర్తాడ్, కమ్మర్ పల్లీ మండలాల మధ్యలో గల లలిత గార్డెన్లో ఆదివారం నిర్వహించిన పట్ట బద్ధుల ఆత్మీయ సమ్మేళనంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో నిరుద్యోగులను నిండా ముంచిందని  నోటిఫికేషన్ లు వేస్తే కోర్టులలో మగ్గిపోయాయని ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 55 వేల ఉద్యోగాలను కల్పించిందని రానున్న రోజుల్లో ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేసి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం మన పదాన్ని సకారం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కులగణనను చేపట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రజలకు ప్రశాంతమైన వాతావరణ ఏర్పడిందని ప్రజా ప్రభుత్వంలో సామాన్యుడి సైతం పనులు చేసుకునే వీలు కల్పించిందని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకోవాలనుకునే ప్రజలకు రూ. 3000 ఇసుక ట్రాక్టర్ అందిస్తూ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాన్ని నెరవేరుస్తున్నమని అన్నారు. కార్యక్రమంలో మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరవత్రి అనిల్, సీడ్ కార్పోరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, కాంగ్రెస్ నాయకులు తాహెర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, పట్టబదులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article