వారి సేవలు మరువలేని

0 1,190

బతుకమ్మ, మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పైన గురువారం కార్యాలయం వద్ద పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఆర్.విద్య సాగర్ రావు ల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ 1963 లో పోచంపాడు ప్రాజెక్టు కు శంకుస్థాపన చేసిన రోజు అభివర్ణి చిన విధంగా ఈ రోజు శ్రీ రాం సాగర్ జలాశయం ఉత్తర తెలంగాణ కు ఆధునిక దేవాలయం గా మారిందని ప్రాజెక్ట్ డీ ఈ ఈ గణేష్ గుర్తు చేశారు. అలాగే విద్య సాగర్ రావు సాగునీటి రంగం లో చేసిన సేవలు మార్చిపోనివని డీ ఈ ఈ సుకుమార్ అన్నారు. వీరిద్దరికీ శ్రీరాంసాగర్ ఉద్యోగులు జీవితాంతం రుణపడి ఉంటారని డీ ఎస్ ఈ లాల్ సింగ్ గుర్తు చేశారు. కార్య క్రమం లో ఏ ఈ ఈ లు , మాణిక్యం, పవన్, రాహుల్, కొండ వంశీ, శ్యాం, జూనీడ్ , టీ వో రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.