ఓటు వేసిన విద్యార్థులు

0 1,298

– లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు

బతుకమ్మ, నవీపేట్ : జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా నవీపేట్ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హెడ్ బాయ్, హెడ్ గర్ల్ లను ఓటు వేసి ఎన్నుకున్నారు. బ్యాలెట్ పేపర్ విధానం లో విద్యార్థులు తమ స్కూల్ లీడర్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంచేందుకు మరియు ఎలక్షన్ పక్రియ ను వివరించేందుకు ఎలక్షన్ నోటిఫికేషన్, నామినేషన్స్, స్క్రిటిని, మేనిఫెస్టో, ప్రచారం, లాంటి ఎన్నికల విధానాల తో ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయి రెడ్డి, రాజు, శరత్, ఆంజనేయులు, ప్రకాష్, త్రివేణి, స్వప్న, సుధారాణి, లావణ్య, లక్ష్మీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Students who voted

Leave A Reply

Your email address will not be published.