అడ్డుకోబోయిన నైట్ వాచ్ మెన్ లపై దాడి చేసిన దుండగులు
రూ. లక్ష విలువ గల హైడ్రాలిక్ పైపుల అపహరణ
భిక్కనూరు, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలో రెడీ మిక్స్ ప్లాంట్ లో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. చోరీని అడ్డుకోబోయిన ఇద్దరు నైట్ వాచ్ మెన్ లపై దుండగులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. టోల్ ప్లాజా శాశ్వత భవన నిర్మాణాల కోసం టోల్ ప్లాజా కు సమీపంలో రెడీమిక్స్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. భిక్కనూరు కు చెందిన నవీన్, ఏపీకి చెందిన వ్యక్తి చిన్న ఈ ప్లాంట్ వద్ద నైట్ వాచ్ మెన్ లుగా పని చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆటోలో నలుగురు గుర్తు తెలియని దుండగులు వచ్చి హైడ్రాలిక్ ఇనునప పైపులు దొంగలిస్తుండగా అలికిడి వినిపించింది. దీంతో నైట్ వాచ్ మెన్లు ఫోన్ లైట్ వేయడంతో దుండగులు వారిపై దాడి చేసి సెల్ ఫొన్ లాక్కుకున్నారు. చోరీ చేసిన సామగ్రిని ఆటోలో వేసుకొని పరారయ్యారు. చోరీకి గురైన సామాగ్రి విలువ సుమారు రూ. లక్ష వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సై ఆంజనేయులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
